ఆదిలాబాద్‌ జిల్లాలో విషాదం.. నీటి గుంటలో పడి ఇద్దరు చిన్నారుల మృతి

ఆదిలాబాద్‌ జిల్లాలో విషాదం.. నీటి గుంటలో పడి ఇద్దరు చిన్నారుల మృతి

దిలాబాద్ జిల్లాలో దురదృష్టకరమైన సంఘటన చోటుచేసుకుంది. సైకిల్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడి అక్క తమ్ముడు ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. మావల గ్రామానికి చెందిన వినూత్న (11), తమ్ముడు విదాత్ (8) గ్రీన్ వ్యాలీ కాలనీలో సైకిల్‌పై వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఆకస్మికంగా నీటి గుంటలో పడిపోయిన వారిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ మార్చురీకి తరలించారు. చిన్నారుల మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

ఆదిలాబాద్‌లో ఏటీఎం  ధ్వంసం చేసి నగదు చోరీ

ఆదిలాబాద్‌లో ఏటీఎం ధ్వంసం చేసి నగదు చోరీ

అదిలాబాద్ నేర విభాగం: ఆదిలాబాద్ పట్టణం రామ్‌నగర్‌లోని ప్రధాన రహదారి పక్కన ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో శనివారం తెల్లవారుజామున చోరీ ఘటన కలకలం రేపింది. దుండగులు గ్యాస్ కట్టర్‌తో ఏటీఎం లాకర్‌ కట్ చేసి అందులోని నగదు ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరాలపై బ్లాక్ స్ప్రే చల్లి అక్కడి నుంచి ఉడాయించారు. ఘటన స్థలాన్ని డీఎస్పీ జీవన్‌రెడ్డి, సీఐలు కర్రె స్వామి, సునీల్ కుమార్ పరిశీలించారు. చోరీకి గురైన నగదు వివరాలను సేకరిస్తున్నారు.

కాగజ్‌నగర్‌ అటవీ ప్రాంతంలో  మళ్లీ పులుల కదలికలు

కాగజ్‌నగర్‌ అటవీ ప్రాంతంలో మళ్లీ పులుల కదలికలు

కాగజ్‌నగర్‌ డివిజన్‌లో మళ్లీ పెద్దపులి, చిరుత కదలికలు గుర్తించడంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. సిర్పూర్‌(టి) రేంజిలో పులి దాడికి ఆవు బలి కాగా, పెంచికల్‌పేట్‌ రేంజిలో చిరుత పశువును హతమార్చింది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రజలను జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.