R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

హైదరాబాద్‌లో బుధవారం పాఠశాలలకు సెలవు సూచన – మూడు రోజుల వర్ష సూచన

హైదరాబాద్‌లో బుధవారం పాఠశాలలకు సెలవు సూచన – మూడు రోజుల వర్ష సూచన

హైదరాబాద్‌లో బుధవారం పాఠశాలలకు సెలవు సూచన – మూడు రోజుల వర్ష సూచన

హైదరాబాద్‌ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆగస్టు 13 (బుధవారం) నుంచి 15 (శుక్రవారం) వరకు వర్షపాతం ఎక్కువగా ఉండనుందని హైడ్రా కమిషనర్ వెల్లడించారు.ఉత్తర హైదరాబాద్, మేడ్చల్, సైబరాబాద్‌ ప్రాంతాల్లో 10 నుంచి 20 సెం.మీ. వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించడంతో పాటు, అత్యవసర సమయాల్లో సంప్రదించేందుకు హెల్ప్‌లైన్ నంబర్లను కూడా విడుదల చేశారు.వాతావరణ పరిస్థితుల దృష్ట్యా బుధవారం నగరంలోని పాఠశాలలకు సెలవు ఇవ్వాలని ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు సమాచారం.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi