Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
తిరుపతిలో వైకాపా అనుచరుల వేధింపులు, గిరిజన యువకుడి పై దాడి
Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
తిరుపతిలో వైకాపా అనుచరుల వేధింపులు, గిరిజన యువకుడి పై దాడి

తిరుపతి: తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అనుచరులు ఆగడాలు కొనసాగిస్తున్నారు. ఇటీవల భూమన అనుచరుడు చైతన్య యాదవ్ ఓ వ్యాపారిపై దాడికి పాల్పడ్డాడు. తాజాగా, వైకాపా సోషల్ మీడియా ఇన్‌చార్జి అనిల్ రెడ్డి శ్రీనివాసం వసతిగృహం ఎదురుగా ఉన్న దుకాణాన్ని తనకు ఇవ్వాలంటూ పవన్ అనే గిరిజన యువకుడిని కిడ్నాప్ చేసి ఎంఆర్‌పల్లిలోని ఇంట్లో బంధించి హింసించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ దృశ్యాలు వీడియోలుగా బయటపడటంతో దుమారం రేగింది. ఈ ఘటనపై హోం మంత్రి అనిత తీవ్రంగా స్పందించారు. చట్టం ప్రతి ఒక్కరికి సమానమని, నేరపూరిత రాజకీయాలను సహించబోమని హెచ్చరించారు. దాడిలో పాల్గొన్నవారిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిపారు.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthitirupathi