
వైఎస్ జగన్ పర్యటనపై ఎస్పీ కఠిన హెచ్చరిక
చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో జూలై 9న జరిగే వైఎస్ జగన్ పర్యటనను దృష్టిలో ఉంచుకుని పోలీసులు కఠిన నిబంధనలు విధించారు. జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు స్పష్టం చేస్తూ, హెలిపాడ్ వద్ద కేవలం 30 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. మామిడికాయల మార్కెట్ యార్డులో 500 మంది రైతులు మాత్రమే కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా చెప్పారు. గతంలో జగన్ పర్యటనల సందర్భంగా చోటుచేసుకున్న అవాంఛనీయ ఘటనల నేపథ్యంలో ఈసారి కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయని అన్నారు. అనుమతులు లేని వారు ప్రదేశానికి వస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

శ్రీ వరసిద్ధి వినాయకుని దర్శించుకున్న నటి రమ్యకృష్ణ
ప్రముఖ సినీ నటి రమ్యకృష్ణ ఆంధ్రప్రదేశ్‌లోని కనిపాకం శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయగా, వేదపండితుల ఆశీర్వాదంతో పాటు తీర్థప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ వాసు, ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.