ఖమ్మం-వరంగల్ హైవేపై లారీలు ఢీ – ముగ్గురు దుర్మరణం

ఖమ్మం-వరంగల్ హైవేపై లారీలు ఢీ – ముగ్గురు దుర్మరణం

మహబూబాబాబాద్: మరిపెడ శివారులోని కుడియాతండా వద్ద శుక్రవారం తెల్లవారుజామున రెండు లారీలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఢీ తర్వాత లారీ క్యాబిన్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్ ఉన్నారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు.

యూరియా కొరత పై  తొర్రూరు రైతుల ఆందోళన

యూరియా కొరత పై తొర్రూరు రైతుల ఆందోళన

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో యూరియా కొరత రైతుల ఆవేదనకు దారి తీసింది. బుధవారం తెల్లవారుజామున రైతులు పిఎసిఎస్ కార్యాలయం ఎదుట బారులు తీర్చారు. ఆధార్ జిరాక్స్ పత్రాలు లభించకపోవడంతో రైతులు చైర్మన్ కాకిరాల హరిప్రసాద్‌ను విమర్శించారు. రెండు ఎకరాలకు కేవలం ఒకే బస్తా యూరియా కేటాయించడంతో ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అధికారులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బిఆర్ఎస్ నేతలు సంఘీభావంగా చర్చలు జరిపారు. కార్యక్రమంలో అధికారులు, రైతులు, పిఎసిఎస్ సిబ్బంది పాల్గొన్నారు.