
విశాఖలో దారుణ ఘటన – నిద్రిస్తున్న భర్తపై భార్య వేడి నీళ్లు
విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం నెరెళ్లవలసలో బుధవారం రాత్రి ఓ దారుణ సంఘటన జరిగింది. స్థానికులు నందిక కృష్ణ, గౌతమి దంపతులు ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వారి మధ్య తరచూ మనస్పర్థలు జరుగుతుండగా, తాజాగా గౌతమి నిద్రిస్తున్న తన భర్తపై వేడినీళ్లు పోసింది. తీవ్రంగా గాయపడిన కృష్ణ ప్రస్తుతం కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

విశాఖలో అదుపు తప్పిన స్కూల్ బస్సు – రెండు తాటి చెట్ల మధ్య ఇరుక్కుపోయిన ఘటన
విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం పాండ్రంకి సమీపంలో ఓ పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో బస్సు అదుపు తప్పి రహదారి పక్కకు దూసుకెళ్లింది. దీంతో బస్సు రెండు తాటి చెట్ల మధ్య ఇరుక్కుని ఒరిగిపోయింది. స్థానికులు వెంటనే స్పందించి బస్సులో ఉన్న విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రోడ్లు బురదమయం కావడం ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.

