

కోల్‌కతాలో కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్
భారత సాయుధ బలగాలు కోల్‌కతాలో కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ – 2025ను ఈ నెల 15 నుంచి 17 వరకు నిర్వహించనున్నాయి. “ఇయర్ ఆఫ్ రిఫార్మ్స్ – ట్రాన్స్‌ఫార్మింగ్ ఫర్ ది ఫ్యూచర్” థీమ్‌తో జరిగే ఈ సమావేశాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో పాటు త్రివిధ దళాల అధికారిులు, మంత్రిత్వశాఖల కార్యదర్శులు పాల్గొననున్నారు.
Lahari

టిక్‌టాక్ రీఎంట్రీపై కేంద్రం క్లారిటీ
భారత్‌లో టిక్‌టాక్ మళ్లీ ప్రారంభమవుతుందన్న ప్రచారంపై కేంద్రం స్పందించింది. యాప్‌పై నిషేధాన్ని ఎత్తివేసే ప్రణాళికలు లేవని ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. ప్రభుత్వంలో ఈ విషయంపై ఎలాంటి చర్చలు జరగలేదని తెలిపారు. 2020లో భద్రతా కారణాల వల్ల టిక్‌టాక్‌తో పాటు పలు చైనీస్ యాప్‌లను భారత్ నిషేధించిన విషయం తెలిసిందే.
Lahari

ఫార్మాసిటీలో గ్యాస్ లీక్.. కార్మికుడి మృతి
అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో డెక్కన్ రెమెడీస్ కంపెనీలో రియాక్టర్ వద్ద గ్యాస్ లీక్ అయింది. ఈ ఘటనలో కార్మికుడు నాయుడు తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Lahari

స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల తర్వాత స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 76 పాయింట్లు పెరిగి 80,787 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 32 పాయింట్లు పెరిగి 24,773 వద్ద ముగిసింది. ఆటో, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్ రంగాలు లాభాలను నమోదు చేశాయి. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఆటో షేర్లు పెరిగాయి. అయితే టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, ఎస్‌బీఐ లైఫ్ వంటి షేర్లు నష్టపోయాయి.
Lahari
జాతీయ వార్తలు
4 వార్తలు

ఉత్తర కశ్మీర్‌లో గుర్తు తెలియని సమాధులపై అధ్యయనం
జమ్ముకశ్మీర్‌లోని ఉత్తర కశ్మీర్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో గుర్తు తెలియని సమాధులు ఉన్నాయని ఒక ఎన్జీవో సంస్థ గుర్తించింది. 4,056 సమాధులలో 90 శాతం ఉగ్రవాదుల సమాధులేనని, వీటిలో 2,493 సమాధులు విదేశీ ఉగ్రవాదులకు, 1,208 సమాధులు స్థానిక ఉగ్రవాదులకు చెందినవని తెలిపింది. కేవలం 9 సమాధులు (0.2%) పౌరులకు చెందాయని తెలిపింది. సంస్థ “సత్యాన్ని వెలికితీయడం: కశ్మీర్‌లో గుర్తు తెలియని సమాధులపై అధ్యయనం” అనే నివేదికను రూపొందించి, ప్రభుత్వ సంస్థలకు అందజేయనున్నది. ఈ అధ్యయనం 2018 నుంచి 2024 వరకు పూర్తి చేయబడింది.

కోల్‌కతాలో కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్
భారత సాయుధ బలగాలు కోల్‌కతాలో కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ – 2025ను ఈ నెల 15 నుంచి 17 వరకు నిర్వహించనున్నాయి. “ఇయర్ ఆఫ్ రిఫార్మ్స్ – ట్రాన్స్‌ఫార్మింగ్ ఫర్ ది ఫ్యూచర్” థీమ్‌తో జరిగే ఈ సమావేశాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో పాటు త్రివిధ దళాల అధికారిులు, మంత్రిత్వశాఖల కార్యదర్శులు పాల్గొననున్నారు.

టిక్‌టాక్ రీఎంట్రీపై కేంద్రం క్లారిటీ
భారత్‌లో టిక్‌టాక్ మళ్లీ ప్రారంభమవుతుందన్న ప్రచారంపై కేంద్రం స్పందించింది. యాప్‌పై నిషేధాన్ని ఎత్తివేసే ప్రణాళికలు లేవని ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. ప్రభుత్వంలో ఈ విషయంపై ఎలాంటి చర్చలు జరగలేదని తెలిపారు. 2020లో భద్రతా కారణాల వల్ల టిక్‌టాక్‌తో పాటు పలు చైనీస్ యాప్‌లను భారత్ నిషేధించిన విషయం తెలిసిందే.

స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల తర్వాత స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 76 పాయింట్లు పెరిగి 80,787 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 32 పాయింట్లు పెరిగి 24,773 వద్ద ముగిసింది. ఆటో, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్ రంగాలు లాభాలను నమోదు చేశాయి. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఆటో షేర్లు పెరిగాయి. అయితే టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, ఎస్‌బీఐ లైఫ్ వంటి షేర్లు నష్టపోయాయి.
అంతర్జాతీయ వార్తలు
4 వార్తలు

భారత మార్కెట్‌లో బంగారం ధరలు ఆల్‌టైమ్ హై – ఇన్వెస్టర్లు ఆసక్తి
ఇండియాలో బంగారం ధరలు ఇటీవల వరుసగా పెరిగి లక్షా 8 వేలకు పైగా చేరాయి. అంతర్జాతీయ మార్కెట్లలో పెరుగుతున్న డిమాండ్, యూఎస్ టారిఫ్ సమస్యలతో డాలర్‌పై ఆధారపడని పెట్టుబడులను ప్రోత్సహించడంతో బంగారంపై ఆసక్తి పెరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా గోల్డ్ రిజర్వులను పెంచింది. ట్రేడ్ అనిశ్చిత్తి కారణంగా స్టాక్ మార్కెట్ల నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకోవడంతో ఇన్వెస్టర్లు సేఫ్ బెట్‌గా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు.

ఏడు నుంచి మూడు.. మాట మార్చిన ట్రంప్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇన్నాళ్లుగా తాను ఏడు యుద్ధాలు ఆపానని చెప్పుకుంటూ వచ్చారు. అయితే తాజాగా ఆయన మాట మార్చి, మూడు యుద్ధాలు మాత్రమే ఆపానని అన్నారు. వాటిలో ఒకటి 31 ఏళ్లు, మరోది 34 ఏళ్లు, ఇంకోది 37 ఏళ్లు కొనసాగాయని, లక్షలాది ప్రాణాలు బలైపోయాయని తెలిపారు. అయితే ఆ యుద్ధాలు ఏ దేశాల మధ్య జరిగాయో స్పష్టంగా చెప్పలేదు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా తానే ఆపగలనని ధీమా వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ ఏడు యుద్ధాలు ఆపానని చెప్పి, ఇప్పుడు మూడు యుద్ధాలు అని చెప్పడం ట్రంప్ మాటలలో అస్పష్టతగా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైట్‌హౌస్ ప్రకారం, ఆయన మధ్యవర్తిత్వం వల్ల థాయ్‌లాండ్-కంబోడియా, ఇజ్రాయెల్-ఇరాన్, ఇజ్రాయెల్-హమాస్, రవాండా-కాంగో, సెర్బియా-కొసావో, ఈజిప్ట్-ఇథియోపియా వంటి దేశాల మధ్య ఘర్షణలు తగ్గాయని పేర్కొంది. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను తానే తగ్గించానని ట్రంప్ తరచూ చెబుతున్నా, భారత్ మాత్రం మూడో దేశం ప్రమేయం లేదని స్పష్టం చేస్తోంది

తుర్కియేలో లగ్జరీ నౌక ప్రారంభానికి నిమిషాలకే మునిగిపోయి అడ్డహస్తం
తుర్కియే జోంగుల్డక్ తీరంలో ఒక లగ్జరీ నౌక ప్రారంభించిన 15 నిమిషాల్లోనే సముద్రంలో మునిగి ప్రమాదానికి గురైంది. దాదాపు 1 మిలియన్ డాలర్ల ఖరీదైన 24 మీటర్ల పొడవు నౌక డోల్స్ వెంట్ో (Dolce Vento), ప్రయాణికులు, సిబ్బందితో ప్రారంభమైనప్పటికి మునిగిపోయింది. అయితే, ప్రయాణికులు, సిబ్బంది, యజమాని, కెప్టెన్ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటన దృశ్యాలు కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, వీడియో వైరల్‌గా మారింది. అధికారులు దర్యాప్తు చేపట్టారు.

షుగర్ స్టాక్స్ దూసుకుపోతున్నాయి
దేశీయ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్న వేళ, సెప్టెంబర్ 2న షుగర్ స్టాక్స్ భారీ ర్యాలీని నమోదు చేశాయి. కారణం – కేంద్ర ప్రభుత్వం చెరుకు రసం, షుగర్ సిరప్, మోలాసిస్ నుంచి ఇథనాల్ తయారిపై ఉన్న పరిమితులను ఎత్తివేయడం. నవంబర్ 1 నుంచి కొత్త ఇథనాల్ ఉత్పత్తి సంవత్సరం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం కీలకమైంది.దీంతో బలరాంపూర్ చిని, శ్రీ రేణుకా షుగర్స్, బజాజ్ హిందుస్థాన్, ఉత్తమ్ షుగర్స్, దంపూర్ షుగర్స్, గోదావరి బయోరిఫైనరీస్ తదితర కంపెనీల షేర్లు గణనీయంగా ఎగిశాయి. రిటైల్ ఇన్వెస్టర్లు కూడా ఈ స్టాక్స్‌పై దృష్టి పెట్టారు.ప్రభుత్వం 20% ఇథనాల్ మిశ్రమంతో పెట్రోల్ విక్రయాలను ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
రాజకీయాలు
4 వార్తలు

చంద్రబాబుపై ప్రేమ ఉంటే విగ్రహం కట్టు: సీఎం రేవంత్‌పై కేటీఆర్ తీవ్ర విమర్శలు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజన్న సిరిసిల్లలో మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబుపై రేవంత్‌కు ఎంత ప్రేమ ఉందో ఇంటి ముందు ఆయన విగ్రహం కట్టుకోవాలంటూ ఎద్దేవా చేశారు. గోదావరి, కృష్ణా జలాలపై తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకోబోమన్నారు. చంద్రబాబు మాటలతోనే కమిటీలు వేస్తావా? అని రేవంత్‌ను ప్రశ్నించిన కేటీఆర్, తెలంగాణ జలాలు తాతవారిది కాదని హెచ్చరించారు. కృష్ణా బోర్డును ఏపీకి తరలించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. కేంద్రం, ఏపీకి చెప్పేంత సీన్ రేవంత్‌కి లేదని, అవసరమైతే బీఆర్ఎస్ పోరాటానికి సిద్ధమని స్పష్టం చేశారు.

ఎవ్వరు వెళ్లిపోయినా పార్టీకి పోయేదేం లేదు : రామచందర్ రావు
తెలంగాణ బీజేపీలోని అసమ్మతి నేతలపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు(Rama Chandar Rao) మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీలో ఎంత పెద్ద నాయకుడు అయినా పార్టీ సిద్ధాంతానికి, క్రమశిక్షణకు కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. పార్టీ నిబంధనలను, క్రమశిక్షణను మీరితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్టీ కంటే ఎవరూ ఎక్కువ కాదని, ఎవరు పార్టీ నుంచి వెళ్లిపోయినా పెద్ద నష్టమేం లేదని తేల్చి చెప్పారు. ఒకప్పుడు భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు బల్ రాజ్ మదోక్ కూడా పార్టీ నియమాలను మీరితే సస్పెండ్ చేశారనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని అన్నారు. అయితే ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గురించే రామచందర్ రావు పరోక్షంగా ఈ వ్యాఖ్యలు అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఏపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవులకు మాధవ్, రామచందర్ రావు నామినేషన్లు
విజయవాడ/హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవుల కోసం నామినేషన్ ప్రక్రియ ఈ రోజు సాయంత్రంతో ముగిసింది. రెండు రాష్ట్రాల్లోనూ ఒక్కో అభ్యర్థి మాత్రమే నామినేషన్ దాఖలు చేయడం విశేషం. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ నామినేషన్ దాఖలు చేశారు. శాసనమండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా సేవలందించిన ఆయనకు పార్టీ విధానాలపై బలమైన అవగాహన ఉంది. ఆయన స్పష్టమైన ప్రస్తావనలు, నిబద్ధత అధిష్టానానికి నచ్చడంతో ఈ కీలక పదవికి ఆయనను ఎంపిక చేసినట్టు సమాచారం. ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి సీనియర్ నాయకుడు నారపరాజు రామచందర్ రావు నామినేషన్ వేశారు. సరిగ్గా మధ్యాహ్నం 2 గంటలకు ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఎంపీ డీకే అరుణ, ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్ వంటి ప్రముఖులు ఆశ చూపినప్పటికీ, పార్టీకి అనుసరణగా, వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తిత్వం ఉన్న రామచందర్ రావుకే ఈ సారి అవకాశం దక్కింది. నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడిన రామచందర్ రావు, తనను విశ్వసించి నాయకత్వ బాధ్యతలు అప్పగించిన బీజేపీ హైకమాండ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. "పార్టీలో అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి, వచ్చే ఎన్నికల్లో బీజేపీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడం నా లక్ష్యం" అని స్పష్టం చేశారు. ఈ నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో, రెండుగురు అధ్యక్షుల పేర్లను పార్టీ అధికారికంగా రేపు ప్రకటించే అవకాశముంది.

తెలంగాణ బీజేపీకి కొత్త కెప్టెన్..బీజేపీ వ్యూహంలో కీలక మలుపు! | kranthi news
తెలంగాణ బీజేపీ చీఫ్‌గా రాంచందర్ రావు ఎంపిక వెనుక వ్యూహం ఏమిటి? - ఈసారి కమల దళం టార్గెట్ కొత్త దిశగా..! తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడి ఎంపికపై తెరలేపింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ప్రత్యామ్నాయంగా, ఎన్. రాంచందర్ రావును పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నియమించబోతున్నట్లు సమాచారం. పార్టీలో ఈ పదవికి పోటీ పడ్డవారిలో ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్ వంటి బీసీ సామాజికవర్గ నాయకుల పేర్లు వినిపించినా, అధిష్ఠానం రాంచందర్‌వైపు మొగ్గు చూపింది. ఇంతకీ, రాంచందర్ రావు ఎంపిక వెనుక రహస్యమేంటంటే – ఆయన మొదటి నుంచీ పార్టీతోనే ఉంటూ, విశ్వసనీయంగా పని చేశారు. విద్యార్థి దశ నుంచే ఆర్‌ఎస్‌ఎస్, ఏబీవీపీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన, బీజేవైఎం, లీగల్ సెల్ వంటి విభాగాల్లోనూ సేవలందించారు. బీజేపీ న్యాయవాద విభాగంలో పేరుగాంచిన ఆయనకు, హైదరాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవమూ ఉంది. వివాదాలకు దూరంగా ఉండే, అన్ని వర్గాలతో సత్సంబంధాలు కొనసాగించే రాంచందర్ రావును ఎంపిక చేయడం ద్వారా పార్టీ స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది. తాజా రాజకీయ పరిస్థితుల్లో, దూకుడు నాయకత్వం కంటే సమన్వయాన్ని ప్రోత్సహించే నాయకత్వం అవసరమని భావిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌లోనూ, మొదటి నుంచీ బీజేపీతో ఉన్న నేత మాధవ్‌కు కీలక బాధ్యతలు అప్పగించడాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. రాంచందర్ రావు ఎంపిక వెనుక, ఆయన్ని బీజేపీ అంతర్గతంగా నమ్మకం కలిగిన నాయకుడిగా పరిగణించడం, కార్యకర్తలతో దగ్గర సంబంధం, పరిపక్వత ఉన్న ప్రస్థానం వంటి అంశాలే కీలకం అయ్యాయని చెప్పొచ్చు. ఇటీవల కాలంలో బీజేపీ తెలంగాణలో తేడాలు కనిపించగా, ఒకరికొకరు విమర్శలు చేసుకునే పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అలాంటి దశలో అందరినీ కలుపుకునే నాయకునిగా రాంచందర్ రావు సరైన ఎంపిక అవుతారన్నది పార్టీ అగ్రనాయకుల అభిప్రాయం. ఎంపికపై కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ, రాంచందర్ తన పనితీరు ద్వారా వాటికి సమాధానం ఇస్తారని ఆయన అనుచరులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, 2029 ఎన్నికల వరకు కమల దళం బలంగా ముందుకెళ్లే రణనీతికి ఇది కీలకమై మార్పుగా చెబుతున్నారు విశ్లేషకులు.
సినిమా & వినోదం
4 వార్తలు

చిరంజీవి చూపిన అవకాశం తేజ జీవితాన్ని మార్చింది
యంగ్ హీరో తేజ సజ్జా తన నటనా ప్రయాణాన్ని చిన్నప్పటినుంచి ప్రారంభించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘చూడాలని ఉంది’ సినిమాలో బాలనటుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఇంద్ర, ఠాగూర్ వంటి చిత్రాల్లో నటించి, చిరంజీవితో మంచి బంధం ఏర్పడింది. తేజ ఒక ఇంటర్వ్యూలో తెలిపినట్లుగా, చిరంజీవి పిక్చర్స్ నుండి వందల ఫొటోలలో తన ఫొటోను ప్రత్యేకంగా ఎంచుకోవడం ఆయన జీవితాన్ని మార్చిందని అన్నారు. అలాగే పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ సినిమాల్లో కూడా బాలనటుడిగా నటించారని తెలిపారు. తాజాగా తేజ ‘మిరాయ్’ సినిమా ప్రమోషన్‌లో పాల్గొంటున్నారు. ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా గోకుల్ పార్క్ బీచ్, వైజాగ్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు.

అల్లు అర్జున్ మలయాళీలకు ఓనం శుభాకాంక్షలు
టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్, మలయాళీలకు ఓనం పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా ఆయన శుభాకాంక్షలు వ్యక్తం చేస్తూ, మలయాళీ సోదరుల జీవితంలో సంపద, శాంతి, శ్రేయస్సు నింపాలని, కొత్త ఆరంభానికి నాంది పలకాలని కోరారు. అల్లు అర్జున్, మలయాళీ అభిమానుల మధ్య **“మల్లు అర్జున్”**గా ప్రసిద్ధి చెందారు మరియు మలయాళంలో కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9: కామన్ కంటెస్టెంట్లతో సెప్టెంబర్ 7 నుండి గ్రాండ్ స్టార్ట్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 సెప్టెంబర్ 7 నుండి స్టార్ మా ఛానల్‌లో ప్రసారం కానుంది. సీనియర్ సెలబ్రిటీలతో పాటు, ఈసారి కామన్ కంటెస్టెంట్లను కూడా హౌస్‌లోకి తీసుకోనున్నారు. ‘అగ్ని పరీక్ష’ గేమ్ ద్వారా 45 మంది మధ్యంచి 6 కామన్ కంటెస్టెంట్లు ఎంపికయ్యారు: దమ్ము శ్రీజ, మాస్క్ మ్యాన్ హరీష్, ఆర్మీ పవన్ కళ్యాణ్, ప్రియ శెట్టి, మర్యాద మనీష్, హీ మ్యాన్ పవన్. ఈ ఆరుగురు కంటెస్టెంట్లు రేపు అధికారికంగా హౌస్‌లోకి ఎంట్రీ అవుతారు. షో కొత్త కాంబినేషన్స్, ఎమోషన్స్, హై వోల్టేజ్ డ్రామాతో ప్రేక్షకులను ఆకట్టబోతోంది

మహేష్ – రాజమౌళి ఎస్‌ఎస్‌ఎంబీ 29 పాన్ వరల్డ్ సినిమా, ₹10,000 కోట్లు టార్గెట్
సూపర్ స్టార్ మహేష్ బాబు – డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న ఎస్‌ఎస్‌ఎంబీ 29 సినిమా టాక్ తెచ్చింది. పాన్ ఇండియా కంటే విస్తృతంగా, ఈ చిత్రం పాన్ వరల్డ్ మూవీగా 120 దేశాల్లో విడుదల కానుందని అధికారికంగా ధృవీకరించారు. లీక్స್ ప్రకారం, సినిమా బడ్జెట్ ₹1,200 కోట్లు, ఇది భారత చలనచిత్రాల్లో అత్యధిక బడ్జెట్ ప్రాజెక్ట్. ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న మాట ప్రకారం, సినిమా టార్గెట్ ₹10,000 కోట్లు వసూలు. హాలీవుడ్ ప్రమోషన్ ఏజెన్సీలతో పాటుగా, ప్రచారం అంతర్జాతీయ స్థాయిలో జరుగుతోంది. ‘బాహుబలి’ సిరీస్, ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి గ్రాండ్ హిట్‌ల తర్వాత, ఈ మహేష్ – రాజమౌళి మూవీ కూడా భారతీయ సినిమా పరిశ్రమలో ఒక మైలురాయిగా నిలవనుంది.
వ్యవసాయం & రైతు వార్తలు
1 వార్తలు

కుంకుమ పువ్వును ఎక్కువగా వాడుతున్నారా..? అతిగా తింటే ఏమౌతుందో తెలిస్తే..
కుంకుమ పువ్వు ఆహారం రుచి, వాసనను పెంచుతుంది. శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. కుంకుమ పువ్వు వాడకం శారీరకంగా మానసికంగా కూడా ఆరోగ్యానిస్తుంది. మనస్సు ప్రశాంతంగా మారి, డిప్రెషన్ లక్షణాలను తగ్గిస్తుంది. అయితే, ఏదైనా సరే అతిగా తినటం అనర్థమే అవుతుంది అంటారు. అలాగే, కుంకుమపువ్వు కూడా ఎక్కువగా తింటే ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మసాలా దినుసు కుంకుమపువ్వు. అంతేకాదు.. దాని ఖరీదుకు తగినట్టుగానే, ఇతర మసాలా దినుసుల కంటే కుంకుమపువ్వు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువ. కుంకుమపువ్వులో క్యాల్షియం, విటమిన్ ఇ, విటమిన్ సి, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఆహారం రుచి, వాసనను పెంచుతుంది. శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. కుంకుమ పువ్వు వాడకం శారీరకంగా మానసికంగా కూడా ఆరోగ్యానిస్తుంది. మనస్సు ప్రశాంతంగా మారి, డిప్రెషన్ లక్షణాలను తగ్గిస్తుంది. అయితే, ఏదైనా సరే అతిగా తినటం అనర్థమే అవుతుంది అంటారు. అలాగే, కుంకుమపువ్వు కూడా ఎక్కువగా తింటే ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

